telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్టార్ హీరో వీర్యం డొనేట్… హృతిక్ పై యాంకర్ సంచలన వ్యాఖ్యలు

Bhavana

కోలీవుడ్ లో మోస్ట్ పాపులర్ యాంకర్ల జాబితాలో భావన బాలకృష్ణన్ కూడా ముందు వరుసలో ఉంటారు. ఎన్నో హిట్ షోలకు ఆమె యాంకర్‌గా వ్యవహరించారు. ఇటీవల కాలంలో పలు స్పో్ర్ట్స్ షోలకు కూడా యాంకరింగ్ చేస్తున్నారు. అయితే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్‌పై ఊహించని కామెంట్స్ చేసి ఇరుక్కుంది భావన. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన వార్ సినిమా గాంధీ జయంతి సందర్భంగా విడుదలైన సంగతి తెలిసిందే. డుదలైన తొలి రోజే ఈ సినిమా రూ.50 కోట్లు రాబట్టింది. మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. తొలి వారంలోనే రూ.200 క్లబ్‌లో చేరింది. ఇది కేవలం ఇండియాలో వార్ సృష్టించిన రికార్డ్. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వాణీ కపూర్ కథానాయికగా నటించారు. అయితే ఈ సినిమాను తాను ఇటీవల చూశానని భావన ట్విటర్ వేదికగా వెల్లడించింది. “వార్ మూవీ రివ్యూ.. సినిమాలో భారీ యాక్షన్ సీన్స్, కార్ చేజింగ్ సీన్స్, హాలీవుడ్‌ సినిమాలను తలపించే స్టంట్స్ ఉన్నాయి కాబట్టి అబ్బాయిలకు ఈ సినిమా నచ్చింది. అమ్మాయిలు ఈ సినిమాను ఇష్టపడటానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్. హృతిక్ మున్ముందు మరెన్నో సినిమాలు చేయాలి. అంతేకాదు ఆయన తన వీర్యాన్ని డొనేట్ చేస్తే బాగుటుంది. మీరు కూడా వెళ్లి వార్ సినిమాను చూడండి” అని పేర్కొంది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు నెగిటివ్ గా స్పందించారు. హృతిక్ చూడటానికి చాలా అందంగా ఉంటాడు కాబట్టి అతని ద్వారా పుట్టే బిడ్డలు కూడా అంతే అందంగా ఉంటారన్నది భావన అభిప్రాయం. కానీ సినిమా బాగుంది అని చెప్పాలి. అంతేకానీ హృతిక్ వీర్యం గురించి ఇక్కడ చర్చించాల్సిన అవసరం ఏముంది? అంటూ నెటిజన్లు క్లాస్ పీకుతున్నారు. కానీ ఆమె ఇంత దరిద్రంగా తన అభిప్రాయాన్ని చెప్పాల్సిన అవసరం లేదు.

Related posts