రక్తదానం చేయడం వల్ల మనిషి ఎంతో ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు తరచుగా చెబుతుంటారు. రక్తదానం చేసే వారిలో గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు 88 శాతం వరకు తగ్గుతాయట. ఎలాంటి రకమైన గుండెజబ్బులు, గుండెకు సంబంధిత ఆరోగ్య సమస్యలు 33 శాతం తగ్గుతాయని చెబుతున్నారు. ఒక్కసారి రక్తదానం చేస్తే మన శరీరంలో ఉండే ఐరన్ 225 నుంచి 250 మి.గ్రా కోల్పోయి గుండె జబ్బులకు గురయ్యే ప్రమాదం తగ్గుతుంది. ఒకసారి రక్తదానం చేస్తే కేవలం రెండు రోజుల వ్యవధిలో శరీరం ఆ రక్తాన్ని భర్తీ చేసుకుంటుంది. కనుక మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని, దీని వల్ల మీ ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. మరోవైపు దాత నుంచి రక్తం సేకరించిన బ్లడ్ బ్యాంక్‌లు, ఆస్పత్రులు వారి రక్తానికి పలు రకాల పరీక్షలు చేస్తాయి. ఒకవేళ ఏదైనా అనారోగ్య సమస్య మొదలవుతుంటే బ్లడ్ టెస్టుల్లో బయటపడుతుంది. మెడికల్ సిబ్బంది నుంచి సమాచారం అందుకుని సంబంధిత వ్యాధికి, అనారోగ్య సమస్యకు వెంటనే ప్రాథమిక దశలోనే చికిత్స తీసుకుని మీ ప్రాణాలను కాపాడుకోవచ్చు.
next post
నెలరోజుల్లో మోదీ మాజీ కావడం ఖాయం: అసదుద్దీన్