telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

రెండో జాబితా విడుదల చేసిన సీపీఐ, సీపీఎం పార్టీలు…

జీహెచ్‌ఎంసీ ఎన్నికలో మొత్తం 15 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసాయి సీపీఐ… సీపీఎం పార్టీలు. ఇందులో సీపీఎం తరపున 7, సీపీఐ తరపున 8 మంది అభ్యర్థులను ప్రకటించాయి. దీంతో మొత్తం 150 డివిజన్లు ఉన్న గ్రేటర్‌లో ఇప్పటి వరకు సీపీఐ… సీపీఎం కలిపి 26  మందో అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అయితే రెండో జాబితాలో ఈ పార్టీలు ప్రకటించిన అభ్యర్థులను ఇక్కడ చూడండి…

సీపీఐ పార్టీ అభ్యర్థులు…

1. జూబ్లీహిల్స్       : డి. కృష్ణకుమారి 
2. ఐఎస్ సదన్     : జి. సుగుణమ్మ 
3. ఎర్రగడ్డ            : యాశ్మిన్ బేగం 
4. అమీర్ పెట్     : మహబూబ్ ఉన్నీసా బేగం 
5. కొండాపూర్       : కె. శ్రీశైలం గౌడ్ 
6. ముసరాంబాగ్   : మస్రత్ జహాన్
7. జగద్గిరిగుట్ట      : ఇ. ఉమామహేష్ 
8. రంగారెడ్డి నగర్ : ఎండీ. యాకుబ్ 

సీపీఎం పార్టీ అభ్యర్థులు…

1. రెహమత్ నగర్  : జె. స్వామి 
2. మౌలాలి            : చల్లా లీలావతి 
3. చిలకనగర్        : కె. భాగ్యలక్ష్మి 
4. జియాగూడ       : ఎ. రాజేష్ 
5. సూరారం          : ఆర్. లక్ష్మీదేవి 
6. సంతోష్ నగర్   : ఎండి. సత్తార్
7. మన్సూరాబాద్ : టి. సత్తిరెడ్డి

Related posts