telugu navyamedia
క్రీడలు వార్తలు

కుక్కకు ప్రాక్టీస్ ఇస్తున్న టీంఇండియా కోచ్…

టీమిండియా హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి శునకంతో ప్రాక్టీస్ చేయిస్తున్నాడు. ప్రాక్టీస్‌ సెషన్‌ తర్వాత విన్‌స్టన్‌ (శునకం)కు టెన్నిస్‌ బాల్‌ను విసిరి క్యాచ్‌ అందుకోమన్నాడు. బంతిని అందుకున్న తర్వాత ఆ శునకం మైదానంలో పరుగెత్తుతూ వచ్చి.. శాస్త్రికి బంతిని అందించింది. శునకంతో క్యాచ్‌లు పట్టిస్తున్న వీడియోను రవిశాస్త్రి ట్విటర్లో షేర్‌ చేశాడు. అది కాస్త వైరల్ అయింది. ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు కోహ్లీసేన వేగంగా సన్నద్ధం అవుతోంది. దొరికిన కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. సోమవారం వరకు అంతర్గత మ్యాచ్‌ ఆడిన భారత్‌ మంగళవారం నెట్స్‌లో శ్రమించింది. ముఖ్యంగా విరాట్‌ కోహ్లీ దేహానికి దూరంగా వెళ్లే బంతులు, షార్ట్‌పిచ్‌ బంతులను ప్రత్యేకంగా సాధన చేశాడు. వైస్ కెప్టెన్ అజింక్య రహానె, యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ సైతం చెమటోడ్చారు. ఇంగ్లండ్‌లో బంతులు స్వింగవుతాయని తెలిసిందే. వేగంగా వచ్చే బంతులను డ్రైవ్‌ చేయాలని భావిస్తుంటారు. ఆ క్రమంలో బంతులు బ్యాటు అంచులకు తగిలి స్లిప్‌లో లేదా వికెట్‌ కీపర్‌కు చిక్కుతుంటారు. అందుకే అలాంటి బంతులను భారత ఆటగాళ్లు సాధన చేశారు.

Related posts