యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ వైద్య పరీక్షల కోసం నిన్న అమెరికాకు బయలుదేరి వెళ్లారు. ఆమె వెంట కుమారుడు రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. గతంలో సోనియా గాంధీ అమెరికాలో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. అనంతరం ప్రతి ఏటా వైద్య పరీక్షల నిమిత్తం ఆమె అమెరికా వెళ్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా ఆమె వైద్య పరీక్షల నిమిత్తం అమెరికాకు పయనమయ్యారు.
ఇదిలా ఉండగా, రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా తన అనారోగ్యం చికిత్స నిమిత్తం ఇప్పటికే అమెరికాలో వున్నారు. మనీ ల్యాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న రాబర్ట్ వాద్రా చికిత్స నిమిత్తం గత నెలలో అమెరికాకు వెళ్లారు. ఆయనతో పాటు ప్రియాంక కూడా అక్కడే ఉన్నారు.
అధికారుల మధ్య చీలిక తెచ్చేందుకు కుట్ర: చంద్రబాబు