సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం సాధారణ మానవుల్నే కాదు, ప్రముఖుల్ని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా క్రికెట్ లెజెండ్ సచిన్ తెందుల్కర్ డ్రైవర్ రహిత కారులో కూర్చుని దానంతట అది పార్కింగ్ చేయడం చూసి వింత అనుభూతికి లోనయ్యారు. ఈ మేరకు ఆయన తన అనుభవాన్ని ట్విటర్ ద్వారా తెలియజేశారు. డ్రైవర్ రహిత కారులో తాను పక్క సీటులో కూర్చుండగా అది దానంతట అది పార్కింగ్ చేసుకునే విధానాన్ని వీడియో తీసి పోస్ట్ చేశారు. ఆ కారు పార్కింగ్ చేసిన విధానంతో తాను ఎంతో వింత అనుభూతికి లోనయ్యానని అన్నారు.
అనిల్‌కపూర్ నటించిన మిస్టర్ ఇండియా సినిమాలో మాదిరిగా కారు దానంతట అదే నియంత్రణ చేసినట్లు అనిపించిందని పేర్కొన్నారు. ఖచ్చితంగా ఈ వారాంతం తన స్నేహితులతో ఎంతో ఉత్సాహంగా ఉంటానని అన్నారు. సచిన్ తెందుల్కర్ పోస్ట్‌కు అనిల్‌కపూర్ ప్రతిస్పందిస్తూ.. మిస్టర్ ఇండియా ఎల్లప్పుడూ వైవిధ్యంగానే కారు పార్కు చేస్తారని హాస్యంగా అన్నారు. ఈ డ్రైవర్ రహిత కారు పార్కింగ్ సాంకేతికత అద్భుతమని ప్రశంసించారు. నెటిజన్లు సైతం సచిన్ పోస్ట్‌పై కామెంట్లతో ముంచెత్తారు.
జులై నెలలో సచిన్ తెందుల్కర్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. సచిన్‌తో పాటు దక్షిణాఫ్రికా మాజీ బౌలర్ అలన్ డొనాల్డ్‌ను, ఆస్ట్రేలియా మహిళా క్రీడాకారిణి కేథరిన్ ఫిట్జ్ పాట్రిక్‌ను కూడా హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేర్చారు. ఈ జాబితాలో తనను చేర్చడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని, అది తనకు ఎంతో ఆనందం కలిగించిందని లండన్‌లో ఐసీసీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు.
ఏబీఎన్, టీవీ5 ఛానళ్లను ఎందుకు ఆపారో మంత్రులు చెప్పాలి: దేవినేని