telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

జంతువులకు కరోనా సోకకుండా..జూ పార్కు సిబ్బంది చర్యలు

zoo fark hyd

క‌రోనా వైరస్ వన్యప్రాణులకు సోకుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో హైద్రాబాద్ నెహ్రూ జూలాజికల్‌ పార్కు అధికారులు అప్రమత్తమయ్యారు. జంతువులకు వైరస్‌ సోకకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ప్ర‌తి జంతువుపై అనుక్ష‌ణం నిఘా వేస్తూ వాటి ఆరోగ్య ప‌రిస్థితిని ఎప్పటికప్పుడు ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

న్యూయార్క్ న‌గ‌రంలోని ఒక జూలో పెద్దపులికి కరోనా పాజిటివ్‌గా తేల‌డంతో.. కేంద్ర స‌ర్కారు దేశంలోని అన్ని జూల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. జంతువుల ఆరోగ్యంపై ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని సూచించింది. ఈ నేప‌థ్యంలోనే నెహ్రూ జూ అధికారులు కూడా త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టారు. వన్యప్రాణుల ఎన్‌క్లోజర్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తున్నారు.

Related posts