ఇటీవల హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నాదే బాధ్యతని ని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఉప ఎన్నికలో ఓటమి, క్రమశిక్షణ ఉల్లంఘన, సభ్యత్వ నమోదు, మున్సిపల్ ఎన్నికలు తదితర అంశాలపై నేతలు చర్చించారు.ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో పార్టీ క్యాడర్ లో ఆత్మస్థైర్యం తగ్గింద అభిప్రాయపడ్డారు.
గత ఎన్నికలతో పోలిస్తే తమ పార్టీ ఈసారి తమ ఓటు బ్యాంకును నిలుకునేందుకు ప్రయత్నం చేసిందని చెప్పారు. అనంతరం వి.హన్మంతరావు మాట్లాడుతూ పార్టీలో క్రమశిక్షణ లోపించిందని అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీఎంలు ఎవరూ కూడా పదవిచేపట్టక ముందే కార్యకర్తలతో సీఎం అని పిలుపించుకోలేదని పేర్కొన్నారు. ఈ సమావేశానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనర్సింహ హాజరు కాలేదు.
జగన్ కు తమ సహకారం ఉంటుంది: నాగబాబు