telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

బ్లాక్‌ ఫంగస్‌ ఔషధాలు దేశవ్యాప్తంగా కొరతగా ఉన్నాయి…

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరిస్థితుల పై టీఎస్ హైకోర్టు విచారణ జరిపింది. అయితే కరోనా పరిస్థితులపై హైకోర్టుకు సమగ్ర నివేదిక సమర్పించింది ఆరోగ్య శాఖ. రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచుతున్నాం. ఏప్రిల్ 29న లక్ష పరీక్షలు నిర్వహించాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన 10 ప్రైవేటు ఆస్పత్రులకు కరోనా చికిత్స లైసెన్సులు రద్దు… 79 ఆస్పత్రులకు 115 షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఇప్పటికి రాష్ట్రంలో 744 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదు కాగా.. ఈ ఫంగస్‌ ఔషధాలకు దేశవ్యాప్తంగా కొరతగా ఉన్నాయి. కరోనా థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాము. ప్రజలకు అవసరమైన మందుల కొనుగోలుకు ప్రణాళికలు సిద్ధం చేసాం. ప్రజలను అప్రమత్తం చేస్తామని ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే చూడాలి మరి ఈ కరోనా థర్డ్ వేవ్ ను అలాగే బ్లాక్‌ ఫంగస్‌ ను ఆరోగ్య శాఖ ఎలా ఎదుర్కొంటుంది అనేది.

Related posts