telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఇంటికి వెళ్లి ప్రజల నుంచి చెత్తను కొనుక్కోండి…

ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ మాట్లాడుతూ… అశాస్త్రీయ పద్దతిలో వేక్సినేషన్లు వేస్తున్నారు అని తెలిపారు. చెత్తకు పన్నులు వేస్తారా… 15 శాతానికి మించి ఆస్తిపన్ను పెంచామంటే ప్రజలకు ఏమి అర్ధమవుతుంది. పన్నులు పెంచుతోంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు నోటికి ప్లాస్టర్లు వేసుకుని వున్నారా అని ప్రశ్నించారు. ప్రతి ఇంటికి వెళ్లిప్రజల నుంచి చెత్తను కొనుక్కోండి.. వాటిని అమ్ముకోండి.. ప్రజలపై భారాలు వేయకండి అన్నారు. పన్నుల పెంపు అంశం కౌన్సిల్ సమావేశాలు చూసుకుంటాయి మీ జోక్యం ఎందుకు. పన్నుల పెంపు విధానం పై ఈనెల న 18 ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తాము. అన్ని మున్సిపాలిటీల్లో నిరసన చేపడతాము అని స్పష్టం చేసారు. ఇక సర్పంచులకు అధికారాలు లేకుండా చేయడం గ్రామస్వరాజ్యమా… ప్రభుత్వ భూములను ఎవరికి తాకట్టు పెడదామనుకుంటున్నారు. ప్రభుత్వ భూములను అమ్ముకోవడం దిగజారుడు తనానికి నిదర్శనం.. ఉత్తరాంధ్రపై వైసీపీ ఇన్చార్జీలు పెత్తనం చేస్తున్నారు అని అన్నారు.

Related posts