15 ఏళ్ల బాలుడు .. 80 ఏళ్ల వృద్ధురాలి నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు. బీహార్‌లోని మధుబని జిల్లా జమాలియా గ్రామంలో జరిగిందీ ఘటన. మధుబని ఎస్పీ సత్యప్రకాశ్ కథనం ప్రకారం.. బాధితురాలికి నిందితుడైన బాలుడు బంధువేనని, ఆమె ఇంటి పక్కనే నివసిస్తుంటాడని తెలిపారు. అర్ధరాత్రి అరుపులు వినిపించకుండా వృద్ధురాలి నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. ఆమె అరుపులు బయటకు రావడంతో మేల్కొన్న కుటుంబ సభ్యులు బాలుడిని పట్టుకున్నారు. అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు.0
వారి దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడినట్టు ఎస్పీ తెలిపారు. వృద్ధురాలి కోడలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్పీ పేర్కొన్నారు. నిందితుడు బాలుడు కాదని, అతడు యువకుడేనని వృద్ధురాలి కోడలు తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే, అతడి సర్టిఫికెట్లు మాత్రం మైనర్ అని చెబుతున్నాయని, అది పూర్తిగా తప్పని పోలీసులకు తెలిపింది. వృద్ధురాలిని చికిత్సకు తరలించామని, బాలుడిని జుడీషియల్ కస్టడీకి పంపినట్టు ఎస్పీ సత్యప్రకాశ్ తెలిపారు.
రైతుల నిరసన పై సంచలన వ్యాఖ్యలు చేసిన రఘునందన్…