telugu navyamedia
క్రైమ్ వార్తలు

డ్రగ్స్‌కు బానిసై బీటేక్ విద్యార్ధి మృతి..

*హైద‌రాబాద్‌లో తొలి డ్ర‌గ్స్ డెత్‌..

*డ్రగ్స్‌ తీసుకుంటుండగా మోతాదు ఎక్కువై బీటెక్‌ విద్యార్థి మృతి
*చ‌నిపోయే ముందు ప్రాణం విల‌విల‌..
*గోవాకు వెళ్ళి డ్ర‌గ్స్ కు బానిసైన విద్యార్ధి..
*డ్ర‌గ్స్ బారిన ప‌డ్డ వారంలో మృతి..
* 7 రోజుల్లోనే మ‌త్తుకు బానిసైన విద్యార్ధి..

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేగింది. డ్రగ్స్‌కు బానిసై బీటేక్ విద్యార్ధి మృతి చెందాడు. ఇటీవ‌ల‌ గోవాకు వెళ్లి డ్రగ్స్‌కు బానిసై న‌ట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో డ్ర‌గ్స్ మోతాదు ఎక్కువ తీసుకోవడం వల్ల వారం రోజులకే తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు పొగొట్టుకున్నాడు . చనిపోయే ముందు ఆస్పత్రిలో ఆ విద్యార్థి విలవిల్లాడుతూ కనిపించాడు. మెదడులో స్ట్రోక్స్ వచ్చి చికిత్స పొందతూ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

దీంతో హైదరాబాద్‌లో డ్రగ్స్ కారణంగా మరణించిన తొలి కేసుగా నిలిచింది. అయితే అందుతున్న సమాచారం మేరకు బీటెక్​ విద్యార్థితో పాటు గోవాకు మరో ఎనిమిది మంది వెళ్లినట్లు తెలిసింది. ఇందులో నలుగురు బీటెక్‌ స్టూడెంట్స్ ఉంటే.. ఐదుగురు డీజేలు ఉన్నట్లు తెలుస్తోందిఈ తొమ్మిది మంది లో ఒకరు చనిపోగా.. 8మంది ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు.

గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్‌ లో అమ్ముతున్న యువకులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ తొమ్మిది మంది బాగోతం వెలుగుచూసింది. మృతి చెందిన యువకుడు కూడా డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మేవాడని పోలీసులు చెబుతున్నారు

Related posts