telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అమెరికాలో తుపాకీ పేలుడు.. ఆరుగురు మృతి…

again gun fire in america 6 died

అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. న్యూజెర్సీ రాష్ట్రంలోని జెర్సీ నగరంలో పోలీసులకు దుండగులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు పౌరులు, ఇద్దరు అనుమానిత నిందితులు సహా ఓ పోలీసు ఉన్నతాధికారి ఉన్నారు. మరో ఇద్దరు పోలీసు అధికారులు, ఓ పౌరుడు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని నిత్యావసర సరకుల దుకాణంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఓ ట్రక్కులో ఘటనా స్థలికి వచ్చిన దుండగులు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించడంతో అనేక మంది దుకాణంలో చిక్కుకున్నట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోగా.. ముష్కరులు వారిపైకి కాల్పులు ప్రారంభించారన్నారు. దీంతో గంటలపాటు భీకర ఎదురుకాల్పులు జరిగాయన్నారు. ఈ క్రమంలో వందల రౌండ్ల కాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు.

ఈ ఘటన నేపథ్యంలో స్థానిక పాఠశాలలు, ఇతర దుకాణాలు వెంటనే మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కాల్పుల్లో మరణించిన పోలీసు అధికారి గతంలో తుపాకీ విష సంస్కృతి నిర్మూలనకు కృషి చేశారు. ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. దీన్ని ఓ భయంకరమైన ఘటనగా అభివర్ణించిన ఆయన.. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. కావాల్సిన సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.

Related posts