ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశం పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చదవి వినిపించారు. మంగళవారం నాడు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అనంతరం వైఎస్ జగన్ అసెంబ్లీలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదాపై సీఎం జగన్ ప్రకటన చేశారు. ప్రత్యేక హోదానే కావాలని తీర్మానం చేస్తున్నామని జగన్ ప్రకటించారు. 59% శాతం జనాభాను, అప్పులను వారసత్వంగా పొందామన్నారు.
రాష్ట్ర విభజనలో మౌళిక సదుపాయాలు అతి తక్కువగా వచ్చాయన్నారు. రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన విషయాన్ని సభలో సీఎం ప్రస్తావించారు. మరీ ముఖ్యంగా ఆదాయాన్ని ఇచ్చే హైదరాబాద్ కూడా ఏపీకి లేకుండా పోయిందన్నారు. గత ఐదేళ్లలో రెవెన్యూ లోటు రూ. 66,300 కోట్లకు పెరిగిందన్నారు. ఉద్యోగాల కోసం యువత పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారని అన్నారు. ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలు పెట్టుబడికి ముందుకు వస్తాయన్నారు. హోటళ్లు, పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.
రేపు పాకిస్థాన్ కూడా టార్గెట్.. ఆరెస్సెస్ పై ఇమ్రాన్ ఫైర్