telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

6 రోజులు బాత్రూమ్ లో చిక్కుకున్న వృద్ధురాలు… చివరకు…!

Bathroom

83 ఏళ్ల వృద్ధురాలు ప్రమాదవశాత్తు ఆరు రోజులు బాత్‌రూంలో చిక్కుకుపోయిన షాకింగ్ సంఘటన ఫ్రాన్స్‌లో జరిగింది. ఈ నెల 10వ తేదీన వృద్ధురాలి బంధువు ఒకరు పోలీసులకు సమాచారం అందించడంతో ఆమెను రక్షించారు. అసలేం జరిగిందంటే… ఇంట్లో ఒంటరిగా ఉండే వృద్ధురాలి నుంచి ఆరు రోజులుగా ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆమె కోడలికి అనుమానం వచ్చింది. ఆరు రోజులుగా ఆమెను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. దీంతో అక్కడి లోకల్ పోలీసులకు ఆమె సమాచారం అందించింది. ఆమె సమాచారంతో పోలీసులు వెంటనే వృద్ధురాలి ఇంటికి వెళ్లారు. ఆమె ఇంటికి వెళ్లి చూసిన పోలీసులకు వృద్ధురాలు బాత్‌రూంలో చిక్కుకుని ఉండడం కనిపించింది. దీంతో వెంటనే ఆమెను బయటకు తీసుకొచ్చి చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆరు రోజులుగా ఆహారం లేకపోవడంతో ఆమె బలహీనంగా, కింద నుంచి లేవలేని స్థితిలో ఉందని పోలీసులు పేర్కొన్నారు. అయితే, వృద్ధురాలు బాత్‌రూంలో ఎలా చిక్కుకుపోయిందో మాత్రం స్పష్టంగా తెలియరాలేదని పోలీసులు చెప్పారు.

Related posts