telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

పెళ్ళి కూతురి గోళ్లలో తండ్రి అస్థికలు… వీడియో వైరల్

Nails

షార్లెట్ వాట్సన్ అనే యువతి నిక్ బీరూట్ అనే యువకుడ్ని ప్రేమించింది. ఈ విషయం తన తండ్రి మిక్ బార్బర్‌కు చెప్పి పెళ్లికి ఒప్పించింది. అయితే వాట్సన్ పెళ్లికి నాలుగు నెలలు ఉందనగా బార్బర్ క్యాన్సర్‌తో కన్నుమూశాడు. తండ్రి ఆకస్మిక మృతితో ఆమె విషాదంలో మునిగిపోయింది. ఎంతో ఇష్టపడే తన తండ్రి లోకం విడిచిపెట్టి వెళ్లిపోవడం, అది తన వివాహనికి కొన్ని రోజుల ముందు ఇలా జరగడం వాట్సన్‌ను తీవ్రంగా కలిచివేసింది. దీంతో పెళ్లికి ఆమె మనస్ఫూర్తిగా రెడీ కాలేకపోతుంది. వాట్సన్ బాధ చూడలేకపోయిన ఆమె స్నేహితురాలు, నెయిల్ ఆర్టిస్ట్ అయిన కిర్స్టీ మెకిన్ ఒక మంచి ఉపాయం చెప్పింది. ఆమె గోళ్ళలో తండ్రి అస్థికలు పెట్టి డిజైన్ చేసింది. ఆ డిజైన్ వాట్సన్‌కు ఎంతో నచ్చడంతో పాటు తండ్రిలేని లోటును కూడా తీర్చినట్టైంది. పెళ్లిలో ఆమె గోళ్ళ డిజైన్ హైలైట్‌గా నిలవడంతో పాటు తన తండ్రి తనతోపాటే ఉన్న అనుభూతి కలిగిందని వాట్సన్‌ చెప్పింది. ఇప్పుడు వాట్సన్‌ గోళ్ళకు సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts