తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో హుజుర్‌నగర్ అసెంబ్లీ నుంచి పోటీచేసి ఉత్తమ్ గెలుపొందారు. అనంతరం పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీచేసి కూడా విజయం సాధించారు.
దీంతో ఎంపీగా కొనసాగాలని నిర్ణయించిన ఉత్తమ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. సోమవారం నాడు తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ కు అందజేసే యోచనలో ఉత్తమ్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఉత్తమ్ రాజీనామా చేస్తే త్వరలోనే హుజుర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.