telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

స్థానిక ఎన్నికలు :మూడో విడత .. నేడే..

local elections polling today as 3rd schedule

ఇవాళ ఉదయం 7 గంటలకు రాష్ట్రంలో 27 జిల్లాల్లో మూడో విడుత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 27 జిల్లాల్లో 9,494 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ప్రక్రియ ముగియనుంది.

ఈ విడతలో 30 ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానం ఏకగ్రీవం కాగా, 160 జడ్పీటీసీ, 1708 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మూడో విడుతలో భాగంగా 160 జడ్పీటీసీ స్థానాలకు 741 మంది అభ్యర్థులు, 1708 ఎంపీటీసీ స్థానాలకు 5,726 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలి విడుతలో వాయిదా పడిన సిద్దిపేట జిల్లా అల్వాల్, రంగారెడ్డి జిల్లాలోని అజీజ్‌నగర్ ఎంపీటీసీ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 27న వెలువడనున్నాయి.

Related posts