telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రికార్డ్స్ అనేవి మారుతూ ఉంటాయి… ప్రభాస్ మాత్రం అందుకు అర్హుడు : అల్లు అర్జున్

Allu-arjun

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల.. వైకుంఠపురములో’ సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తూ ‘నాన్ బాహుబలి’ రికార్డుల మోత మోగిస్తోంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర బృందం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ‘మీరు, ప్రభాస్ ఫ్రెండ్స్ కదా మీ ఇద్దరి మధ్య ఈ రికార్డ్స్ గురించి ఏమైనా మాటలు వచ్చాయా?’ అని మీడియా అడిగిన ప్రశ్నకు అల్లు అర్జున్ సమాధానమిచ్చారు. “బాహుబలి గురించి నేను ఇప్పటివరకు మాట్లాడే అవకాశం రాలేదు. రాజమౌళిగారికి పర్సనల్‌గా మాత్రం చెప్పాను. బాహుబలి మూవీతో ప్రభాస్‌కు ఎంత పేరు వచ్చినా కూడా అందుకు అతను అర్హుడు. మిర్చి లాంటి సినిమా తర్వాత ఒక ఐదు సంవత్సరాలు ఒక కమర్షియల్ హీరో ఎన్ని కోట్లో సంపాదించుకుని ఉండొచ్చు. అయిదేళ్లలో ఒకటిన్నర సంవత్సరం మాత్రమే వర్కింగ్ డేస్ ఉంటాయి. మిగతా మూడున్నర సంవత్సరాలు ఖాళీగా ఉంటాయి. అంతకాలం ఒక విషయం నమ్మి కూర్చున్నదానికి, అతను శాక్రిఫైజ్ చేసినదానికి ఎంత వచ్చినా కూడా దానికి అతను అర్హుడే. మేడమ్ టుస్సాడ్స్‌లో అతని స్టాచ్యూ పెట్టినందుకు నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ప్రభాస్‌కు అంత పెద్ద హిట్ వచ్చినందుకు ఐ యామ్ వెరీ హ్యాపీ. ఈరోజు మా రెండు సినిమాలు టాప్ టు ఫిలిమ్స్ అయినందుకు చాలా హ్యాపీ. రికార్డ్స్ అనేవి ఎప్పుడు మారుతూ ఉంటాయి. ఇవాళ మనం కొట్టవచ్చు, ఆర్నెల్ల తర్వాత ఇంకొకరు కొట్టొచ్చు. అయితే ప్రజల మనసుల్లో ఒక సినిమా ఉన్నప్పుడు వచ్చే ఫీలింగ్ ఉంటుంది చూశారా అది ఫరెవర్. దాన్నెవ్వరూ రీప్లేస్ చెయ్యలేరు’’ అని తెలిపారు.

Related posts