telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఫలించిన తమ్మినేని భార్య వార్నింగ్…

ఆమదాలవలస మండలంలోని కలివరం పంచాయతీలోని ప్రైమరీ స్కూల్ ను ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి …తొగరాం సర్పంచ్ వాణి సందర్శించారు. కలివరం స్కూల్ కు గోరుముద్ద పథకం లో భాగంగా అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత ఉండటం లేదని ఫిర్యాదు మేరకు స్కూల్ ను సందర్శించిన వాణి…ఆహారం నాణ్యతను పరిశీలించారు. చిన్నారులకు పెడుతున్న ఆహారం అధ్వాన్నంగా ఉండటంతో మధ్యాహ్న భోజన పథకం కాంట్రాక్టర్ కు ఫోన్ చేశారు. భోజనం నాణ్యత పై ఫోన్ లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు పెట్టేది ఇలాంటి భోజనమేనా అని కాంట్రాక్టర్ ను ఫోన్ లో నిలదీశారు. గతంలో ఓమారు హెచ్చరించినా మార్పు రాకపోవడంతో సీఎంకు ఫిర్యాదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఐతే వాణి వార్నింగ్ తో కాంట్రాక్టర్ కొంత మార్పు వచ్చింది. కలివరం ప్రైమరీ స్కూల్ కు సరఫరా చేస్తున్న ఆహారంలో కొంత నాణ్యత పెంచాడు. తమ్మినేని వాణీ హెచ్చరిక తర్వాత ఆహార నాణ్యత లో కొంత మార్పు వచ్చిందని…మొన్నటి కంటే పర్వాలేదంటున్నారు చిన్నారులు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై మధ్యాహ్న భోజన పథకం అధికారులు రంగంలోకి దిగారు. చూడాలి మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది.

Related posts