telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

భారత్-ఆసీస్ మూడో టెస్ట్ : ముగిసిన రెండో రోజు ఆట..

భారత్ ఆసీస్ పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఈ రెండు జట్లు టెస్ట్ సిరీస్ లో పోటీ పడుతున్నాయి. అయితే అందులో భాగంగా భారత్-ఆసీస్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ రెండో రోజు ఆట ముగిసింది. అయితే ఈరోజు ఆసీస్ పై భారత్ దే పై చేయి అని చెప్పాలి. మొదట… నిన్న ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసిన ఆసీస్ ను నేడు 338 పరుగులకు కట్టడి చేసారు భారత బౌలర్లు. అయితే ఆసీస్ ఆటగాళ్లలో స్మిత్ (131), లబుషెన్ (91) చెలరేగిపోయారు. ఇక ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన భారత ఓపెనర్లు చాలా జాగ్రత్తగా ఆడుతూవచ్చారు. కానీ ఆసీస్ బౌలర్ హాజెల్ వుడ్ వేసిన 27 వ ఓవర్లో క్యాచ్ రూపంలో 26 పరుగుల వద్ద వెనుదిగాడు రోహిత్ శర్మ. ఆ వెంటనే అర్ధశతకం పూర్తి చేసుకొని మరో ఓపెనర్ శుబ్‌మాన్‌ గిల్(50) కామెరాన్ గ్రీన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వరుస వికెట్లు కోల్పోవడంతో రహానే, పుజారా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. దాంతో ఆట ముగిసే సమయానికి 96/2 తో నిలిచింది భారత్. అయితే ఆసీస్ కంటే ఇంకా 242 పరుగులు వెనుకబడి ఉంది టీంఇండియా. చూడాలి మరి రేపు ఏం జరుగుతుంది అనేది.

Related posts