telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కేంద్రానికి షాక్ ఇచ్చిన పంజాబ్ మాజీ సీఎం …

ఢిల్లీలో రైతుల ఆందోళన రోజురోజూకీ తీవ్రమవుతోంది… వీరికి అనుకూలంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని రైతులు నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తుండగా… రాజకీయ నేతలు, రిటైర్డ్ జడ్జీలు, అధికారులు సైతం వారికి మద్దతు తెలుపుతున్నారు.. ఈ నేపథ్యంలో ఇంతకాలం ఎన్డీఏకు మద్దతుగా ఉన్న పంజాబ్ మాజీ సీఎం, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) నేత ప్రకాష్‌ సింగ్ బాదల్ కూడా రైతులకు మద్దతు తెలిపారు… రైతుల కోసం ఏం చేసేందుకైనా తాను సిద్ధమని ప్రకటించిన ఆయన… రైతులకు సంఘీభావం ప్రకటించేందుకు, వారి కోసం త్యాగం చేసేందుకు తన వద్ద ఏదీ లేదని విచారణం వ్యక్తం చేశారు.. ఇదే సమయంలో.. రైతులకు గౌరవం దక్కని చోట తనకు గౌరవం అవసరంలేదని.. దాని కోసం.. గతంలో కేంద్ర ప్రభుత్వం తనకు ఇచ్చిన పద్మవిభూషణ్ పురస్కారాన్నితిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు. ఇక, రైతులను మత, వేర్పాటవాద శక్తులుగా చిత్రీకరిస్తున్న కేంద్రానికి వ్యతిరేకంగా పంజాబ్ నేతలంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు బాదల్. దీంతో.. ఎన్డీఏకు షాక్ తగిలినట్టు అయ్యింది.. తమను సమర్థిస్తూ వచ్చిన నేతలు కూడా.. రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుతుండడంతో.. ఏం చేయలో తోచని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ఇక, తన పద్మ విభూషణ్‌ అవార్డును తిరిగి వెనక్కి ఇస్తున్నట్టుగా.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ కార్యాలయానికి ఈ మెయిల్ పంపించారు ఆయన.

Related posts