telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

దిల్లీ యూనివర్సిటీ ఎన్నికలలో … తెలుగు వారి విజయం..

telugu people won in DU elections

తాజాగా జరిగిన యూనివర్సిటీ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన దేవరపు వెంకటేశ్‌, అనుగు అంజలారెడ్డి ఘన విజయం సాధించారు. వారిద్దరూ స్వత్రంత్ర అభ్యర్థులుగా దిల్లీ వర్సిటీ పరిధిలోని వేర్వేరు కళాశాలల నుంచి సెంట్రల్‌ కౌన్సిల్‌ అభ్యర్థులుగా గెలుపొందారు. ఆ కళాశాలలు రెండూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఇచ్చే ర్యాంకింగ్‌లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉండటం విశేషం. యూనివర్సిటీ పరిధిలోని 87 కళాశాలలకు నిర్వహించిన ఎన్నికల్లో సెంట్రల్‌ కౌన్సిల్‌ అభ్యర్థుల ఫలితాలు విడుదల చేశారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి ఫలితాలు నేడు వెలువడనున్నాయి.

తెలంగాణలోని జగిత్యాల జిల్లా అల్లాపూర్‌కు చెందిన అనుగు అంజలారెడ్డి మిరండా కళాశాలలో బీఏ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఆమె తన సమీప ప్రత్యర్థిపై 264 ఓట్ల మెజారిటీతో గెలుపొంది సెంట్రల్‌ కౌన్సిల్‌గా ఎన్నికయ్యింది. అంజలారెడ్డి యూనివర్సిటీలో ఆ కళాశాల ప్రతినిధిగా వ్యవహరిస్తుంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఇచ్చే ర్యాంకింగ్‌లో మిరండా కళాశాల తొలి ర్యాంకులో కొనసాగుతోంది. మరో అభ్యర్థి ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దేవరపు వెంకటేశ్‌ హిందూ కళాశాలలో బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి సమీప ప్రత్యర్థిపై రికార్డు స్థాయిలో 654 ఓట్ల మెజారిటీ సాధించి సెంట్రల్‌ కౌన్సిల్‌గా ఎన్నికయ్యాడు. వెంకటేశ్‌ ఇకపై యూనివర్సిటీలో ఆ కళాశాల ప్రతినిధిగా వ్యవహరిస్తాడు.

Related posts