telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

అన్ని ఆధారాలతోనే అచ్చెన్నాయుడి అరెస్ట్: ఏసీబీ జేడీ

acb ap logo

ఈఎస్ఐ కుంభకోణంలో అన్ని ఆధారాలనూ పరిశీలించిన తరువాతనే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశామని విశాఖ రేంజ్ ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవి కుమార్ వెల్లడించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ కేసులో ఇంతవరకూ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. నియమ నిబంధనలను ఉల్లంఘించి మార్కెట్ ధరకన్నా ఎక్కువకు మందులు కొనుగోలు చేయడం ద్వారా ఖజానాకు నష్టం కలిగించారన్న ఆధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు.

నామినేషన్ విధానంలో టెండర్లను కేటాయించిన గత ప్రభుత్వంలోని అధికారులు, మంత్రి, అధిక ధరలకు మందులను కొన్నారని తెలిపారు. ఈ కేసులో అప్పటి ఈఎస్ఐ డైరెక్టర్లు జీకే రమేశ్ కుమార్, విజయ్ కుమార్ లను ను అరెస్ట్ చేశామని, వీరిని విజయవాడ ఏసీబీ కోర్టులో మధ్యాహ్నం తరువాత ప్రవేశపెడతామని తెలిపారు.

రూ. 988 కోట్ల కొనుగోళ్లలో రూ. 150 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని అన్నారు. ఈ కేసును మరింత లోతుగా విచారించేందుకు నిందితులను కస్టడీకి కోరనున్నట్టు తెలిపారు.బినామీ పేర్లతో రమేశ్ కుమార్, తన బంధువులను రంగంలోకి దించి, వారి పేరిట మందులను కొనుగోలు చేశారని రవి కుమార్ తెలియజేశారు. ప్రిన్సిపల్ సెక్రెటరీకి తెలియకుండానే మంత్రి సమక్షంలోనే ఫైళ్లు తయారయ్యాయనడానికి ఆధారాలు ఉన్నాయని తెలిపారు.

Related posts