ఐపీఎల్ లో బెంగళూరు టీమ్‌కు ఆడుతున్న మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్.. 14వ సీజన్ మొదలయ్యే ముందు తన ఫేవరెట్ ఆల్‌టైమ్ ఐపీఎల్ లెవన్ టీమ్‌ను ప్రకటించాడు. ఐపీఎల్ నిబంధలు ప్రకారం తుది జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లకు ఏబీ అవకాశం ఇచ్చాడు. బెన్ స్టోక్స్, రషీద్ ఖాన్, కగిసో రబడలకు చోటు కల్పించాడు. అయితే మరో స్థానం కోసం ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకున్నాడు. ఏబీ ప్రకటించిన టీమ్‌కు కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోనీని ఎంపిక చేశాడు. ఇక ఓపెనర్లుగా వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ.. మూడో స్థానంలో విరాట్ కోహ్లీని ఎంచుకున్నాడు. అయితే నాలుగో స్థానంలో ఎవరు ఉంటారనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఆ స్థానంలో కేన్ విలియమ్స్‌న్, స్టీవ్ స్మిత్‌తో పాటు తన పేరును కూడా డివిలియర్స్ ప్రకటించుకున్నాడు. ఆల్‌రౌండర్ల కోటాలో బెన్ స్టోక్స్, రవీంద్ర జడేజాలను ఎంపిక చేశాడు. పేస్ బాధ్యతలు జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, కగిసో రబడలకు.. స్పిన్ బాధ్యతను రషీద్ ఖాన్, జడేజాలకు అప్పగించాడు. అయితే ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో చెన్నై వేదికగా సీజన్ తొలి మ్యచ్‌ను ఆడనుంది.
ఏబీ డివిలియర్స్ ఆల్‌టైమ్ ఐపీఎల్ బెస్ట్ ఎలెవన్
వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్/ స్టీవ్ స్మిత్ / ఏబీ డివిలియర్స్, బెన్ స్టోక్స్, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్, కెప్టెన్), రవీంద్ర జడేజా, రషీద్ ఖాన్, కగిసో రబడ, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్.
జానారెడ్డి పెద్ద కొడుకుగా ఉంటా : రేవంత్ రెడ్డి