అగ్రవర్ణాలకు పెద్ద పదవులు ఇస్తున్నారన్నారు. తిరుపతి పవిత్రతను దెబ్బతినే విధంగా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని సంక్షేమం పేరుతో మాయ మాటలు చెబుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఎస్ఈసీ పదవి ఇస్తానని దళితుడైన కనకరాజ్ ను జగన్ అవమానించారని అన్నారు. తిరుపతిని అభివృద్ధి చేసింది టీడీపీ అని పేర్కొన్న ఆయన రెండు సంవత్సరాలుగా ఒకే ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదని అన్నారు. పంచభూతాలను దోచేసిన ప్రబుద్ధులు వైసీపీ నేతలు అంటూ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో జగన్ చేతకాని పరిపాలనను ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. 21 మంది వైసీపీ ఎంపీలు గొర్రెలు..ముగ్గురు టీడీపీ ఎంపీలు సింహాలు అని ఆయన అన్నారు. ఇక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ప్రత్యేక హోదాను వైసీపీ తాకట్టు పెట్టిందని కేసుల మాఫీ, దోచుకున్న డబ్బులు దాచుకోవడానికి జగన్ కు సమయమంతా సరిపోతుందని అన్నారు. పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని స్వయంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారని, ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వమన్న కేంద్ర ప్రభుత్వ పెద్దలను వైసీపీ నేతలు చొక్కా పట్టుకుని ఎందుకు ప్రశ్నించలేదు ? అని ప్రశ్నించారు.
తాను ఏ విచారణకైనా సిద్ధం: చింతమనేని