telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కేసీఆర్ కి తన కుటుంబ ఆదాయం తప్ప మరో ఆలోచన లేదు : కోదండరాం

Kodandaram

ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ… తెలంగాణలో బతుకు దేరువు కరువయ్యింది. నిరుద్యోగులు, రైతులు, ప్రయివేట్ టీచర్లు ఉపాధి కొలిపోయారు. వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అందుకే మనుషులుగా స్పందిస్తున్నాం. అందుకే పోరాటం ఉదృతం చేసాము…రెండు రోజుల నిరాహార దీక్ష చేపట్టాము. శాంతి యుత దీక్ష కు అనుమతి ఇవ్వలేదు. హింస చెలరేగుతున్నది అనడం దౌర్భాగ్యం. ఉద్యోగాల భర్తీ మాటలే తప్ప అమలు లేదు. ధాన్యం కొనుగోళ్ళు కేంద్రాలు ఎత్తి వేశారు.. 500 crs ఇస్తే టీచర్లు, చిన్న పాఠశాలలు బతుకుతాయి అని పేర్కొన్నారు. తమ కుటుంబం ఆదాయం తప్ప.మరో ఆలోచన లేదు కేసీఆర్ కి అని తెలిపారు. పెద్ద కంపెనీ లకు భూములు, కాంట్రాక్టర్ లకు పనులు అప్ప చెప్పి కమిష న్ తీసుకుంటున్నారు. బతుకు దేరువే  తెలంగాణ సాధనకు కారణం. కానిప్పుడు బతుకు దేరువు కల్పించే పరీస్థితి లేదు. ఐక్యంగా సాగుదాం మన సమస్యలు పరిష్కరించుకుందాం.. ఇది ఆరంభం మాత్రమే.. ఉద్యోగాల క్యాలెండర్ ఎందుకు విడుదల చేయరు.. నిరుద్యోగ భృతి ఎక్కడ..ప్రయివేటు టీచర్ల సమస్యలు ఎందుకు పరిష్కరించారు… తెలంగాణ అభివృద్ధి మీరు చేయలేరు.. భవిష్యత్ కు దారి మేమే వేసుకుంటాం.. మీకు చేతకాదు మీరు వెంటనే దిగిపోవాలి అని అన్నారు. తెలంగాణ సాధన కన్నా తెలంగాణ అభివృద్ధి పై పోరాటం తీవ్ర తరం చేస్తాం. ఈ నెల 20 వరకు అందరిని కలుపుకోవడానికి జిల్లాజిల్లా సమావేశాలు నిర్వహిస్తాం.. ఫిబ్రవరి 3 వ వారం లో మిలియన్ మార్చ్ తరహాలో హైదరాబాద్ లో మరో మిలియన్ మార్చ్ నిర్వహిస్తాం అని అన్నారు.

Related posts