భట్టి విక్రమార్క మాట్లాడుతూ… పేదల భూములు… అధికారం లో ఉన్న మంత్రులు… ఎమ్మెల్యే లు అక్రమించుకు న్నారని మేము చాలా సార్లు చెప్పినా… కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇచ్చిన భూములు అక్రమించినట్టు సీఎం కి ఫిర్యాదు వచ్చినట్టు… వెంటనే విచారణ కు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర ప్రజల ముందు ఈటెల ల అక్రమాలు చేశారని ప్రచారం చేశారు . సీఎం కి సూటిగా ప్రశ్నలు వేస్తున్నాం. డ్రగ్స్ కేసు విచారణకు ఆదేశించి… ఆపేశారు. మియాపూర్ భూముల పై విచారణ చేస్తున్నట్టు ఆర్భాటం సృష్టించారు. ప్రభుత్వం మీద దాడి పెరుగుతున్న సమయంలో ప్రజల దృష్టి మల్లిస్తుండటం కేసీఆర్ కి అలవాటు. కేసీఆర్ అలసత్వం వల్ల కరోనా పెరిగింది. ఇలాంటి పరిస్థితిలో ఆరోగ్య శాఖ మంత్రిగా పై ఇలాంటి అరోనలు బయటకు తీశారు. చిత్తశుద్ది ఉంటే… ఆక్రమణలకు గురైనభూములు ప్రజలకు ఇవ్వాలని అనుకుంటే… మంత్రి మల్లారెడ్డి పై ఎందుకు విచారణ చేయలేదు. పువ్వాడ అజయ్… లాంటి మంత్రుల మీద కూడా ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోలేదు అని తెలిపారు.
previous post
ఆర్థిక వ్యవస్థను బీజేపీ కుప్పకూల్చింది: చిదంబరం