telugu navyamedia
రాజకీయ వార్తలు

గవర్నర్ ఇచ్చిన గడువు ముగిసింది.. అసెంబ్లీలో బలపరీక్ష జరగలేదు!

Siddaramaiah comments sadvi

కర్నాటక రాజకీయ పరిణామాలు రోజురోజుకూ మలుపులు తిరుగుతున్నాయి.ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటల లోపే సంకీర్ణ ప్రభుత్వం తమ మెజార్టీని రూపించుకోవాలని గవర్నర్ ఇచ్చిన గడువు ముగిసిపోయింది. కర్ణాటక అసెంబ్లీలో ఇప్పటి వరకూ ఎలాంటి బలపరీక్ష జరగలేదు.చర్చ ముగిసే వరకూ ఓటింగ్ జరగదని స్పీకర్ రమేశ్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో సభ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈరోజు బలపరీక్ష జరిగే అవకాశం లేదని అన్నారు. సోమవారం వరకూ బలపరీక్షపై చర్చ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇంకా 20 మంది సభ్యులు మాట్లాడాల్సి ఉందన్నారు. విశ్వాసపరీక్షపై చర్చ పూర్తి కానందున ఇప్పటికిప్పుడే బలపరీక్ష నిర్వహించడం అసాధ్యమని అన్నారు. సీఎం కుమారస్వామి విశ్వాస తీర్మానాన్ని మాత్రమే ప్రవేశపెట్టారని, జరిగిన చర్చపై ఆయన ఇంకా సమాధానం చెప్పలేదని పేర్కొన్నారు.

Related posts