telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగనన్న విద్యా కానుకపై బహిరంగ చర్చకు సిద్దం..

జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీలో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. ప్రతి రోజూ 50 కిట్లకు మించకుండా జగనన్న విద్యా కానుక పంపిణీ జరుగుతోందని…జగనన్న విద్యా కానుక కార్యక్రమం మీద ప్రతిపక్షం బురద జల్లుతోందని మండిపడ్డారు. మంచి కార్యక్రమాన్ని చూసి ప్రతిపక్షం కడుపు రగిలిపోతోందని…కేంద్రం నిధులతో జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారంటూ అవాకులు చెవాకులు పేలుతున్నారని ఫైర్‌ అయ్యారు. 43 లక్షల మంది విద్యార్ధులు లబ్ది పొందుతున్నారని…స్కూల్ బ్యాగులకు మొత్తం రూ. 69 కోట్లు ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని వెల్లడించారు.

నోట్ బుక్స్, షూస్, బెల్టుల ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని…యూనిఫాం, టెక్స్టు పుస్తకాలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వ నిధులు ఇస్తుందని తెలిపారు. ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదని…ప్రజలు సంతోషంగా ఉంటే.. ప్రతిపక్షానికి బాధగా ఉందని పేర్కొన్నారు. జగనన్న విద్యా కానుకపై బహిరంగ చర్చకు సిద్దమని…జగనన్న విద్యా కానుక పథకానికి సంబంధించి మిగిలిన రాష్ట్రాలు ఆరా తీస్తున్నాయని తెలిపారు. జగన్ స్టిక్కర్ సీఎం కాదు.. స్ట్రైకింగ్ సీఎం అని పేర్కొన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్‌. ఈ ప్రభుత్వానికి వచ్చినన్ని మంచి ఆలోచనలు టీడీపీకి ఎప్పుడైనా వచ్చాయా..? జగనన్న చెప్పాడంటే.. చేస్తాడంతే అని ప్రజలు అనుకుంటారని చెప్పారు.

Related posts