telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

తులసితో .. ఆరోగ్యం .. ఇలా.. !

health with tulasi leafs

మనకు తులసీ పూజనీయమైనదే కాక తులసిలో లెక్కలేనన్ని ఔషధ గుణాలు నున్నాయి. ముఖ్యంగా కఫాన్ని అదుపులో వుంచేందుకు తులసి అద్భుతంగా పనిచేస్తుంది. రక్తంతో కూడిన దగ్గు, కఫం పడుతున్నప్పుడు తులసి ఆకులు నాలుగు చొప్పున ప్రతి గంటగంటకూ తింటే దగ్గు, ఇతర సమస్యలు తగ్గుముఖం పడతాయి. కడుపులోని క్రిములను పారదోలే శక్తి తులసికి ఉంది. తులసిని వాడితే క్రిములు తొలగడమే కాక రక్తహీనత కూడా నివారించబడుతుంది. జీర్ణ శక్తికి తులసి చాలా మంచి మందు.

* తులసి ఆకులు నాలుగు, మిరియాలు రెండు వేసి మెత్తగా నూరి చిన్న మాత్రగా చేసుకుని భోజనానికి అరగంట ముందుగా వేసుకుంటే బాగా ఆకలి వేస్తుంది. తిన్నది కూడా జీర్ణమవుతుంది.

* ముఖ్యంగా 7, 8 ఏళ్ల పైబడిన చిన్న పిల్లలు అన్నం తినకుండా మారాం చేస్తుంటారు. ఆకలి లేదంటుంటారు. అలాంటి వారికి రోజూ ఉదయం నాలుగు తులసి ఆకులు తినిపిస్తే జీర్ణక్రియ సాఫీగా జరిగి ఆకలి బాగా వేస్తుంది.

* ప్రధానంగా తులసి జ్వరహారిణి. సాధారణ జ్వరాలు ఏవి వచ్చినా తులసి ఆకులతో కషాయం కాచి తాగితే తగ్గిపోతుంది. పైగా టైఫాయిడ్ జ్వరంలో తులసి చెట్టు కాండమును బాగా దంచి కషాయం కాచి ప్రతిపూటా తాగుతుంటే జ్వరం నెమ్మదిస్తుంది.

* ఉబ్బసాన్ని నివారించడంలో తులసి కీలకమైన ఔషధం. ఉబ్బస నివారణ ఆయుర్వేద మందులన్నింటిలోనూ తులసి తప్పకుండా ఉంటుంది. తరచుగా ఉబ్బసానికి గురయ్యేవారు తులసి కషాయం తీసుకుంటూ ఉంటే కొన్నాళ్లకు ఉబ్బసం రాదు.

Related posts