చంద్రబాబును విమర్శించే స్థాయి రోజాకు లేదని టీడీపీ నేత దివ్యవాణి అన్నారు. చంద్రబాబు, లోకేశ్ చేసిన తప్పులకు జీవితాంతం జైల్లో ఉంటారని రోజా చేసిన వ్యాఖ్యలపై దివ్యవాణి ధ్వజమెత్తారు. రోజా భజన కార్యక్రమాలు నిలిపివేసి ప్రజాసమస్యలను సీఎం ముందుంచాలని హితవు పలికారు.
పాలన అంటే మేకప్ వేసుకోవడం, జబర్దస్త్ స్కిట్లు చేయడం కాదని రోజాకు చురకలంటించారు. సినీ పరిశ్రమ తలదించుకునేలా రోజా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సొంత నియోజకవర్గ ప్రజలే రోజాను అసహ్యించుకుంటున్నారని దివ్యవాణి విమర్శించారు.
ఆ వార్తలన్నీ వదంతులే: కిరణ్ బేడీ