telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

భారత్-పాక్ సంభంధాల పై ఇమ్రాన్ వ్యాఖ్యలు…

imran on terrorism in UN

2018లో తాను పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టగానే భారత్‌కు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఓ సందేశం పంపించానని పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్ గుర్తు చేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడమే ఉపఖండం ముందు ఉన్న మార్గమని తెలియజేసినట్టు చెప్పుకొచ్చారు.. అయితే, తాను మాత్రం ఈ విషయంలో విజయం సాధించలేదని, కానీ, ఎప్పటికైనా చర్చలు జరుగుతాయనే ఆశాభావంతో ఉన్నానని పేర్కొన్నారు ఇమ్రాన్… కాశ్మీర్ భారత్‌తో ఉన్న ఏకైక వివాదం, ఇది సంభాషణల ద్వారా మాత్రమే పరిష్కరించబడుతుంది అన్నారు. ఉపఖండం పేదరికాన్ని పరిష్కరించగల ఏకైక మార్గం వాణిజ్య సంబంధాలను మెరుగుపరచడం అన్నారు.. అయితే, ఉద్రిక్తతలు, శత్రుత్వం లేని వాతావరణాన్ని సృష్టించే బాధ్యత పాకిస్థాన్‌పై ఉందని భారత్ తెలిపింది.. మా స్థానం అందరికీ తెలుసు అన్నారు.. శత్రుత్వం మరియు హింస లేని వాతావరణంలో పాకిస్థాన్‌తో సాధారణ పొరుగు సంబంధాలను భారత్ కోరుకుంటుంది అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ అన్నారు. అటువంటి వాతావరణాన్ని సృష్టించిన బాధ్యత పాకిస్థాన్ మీదే ఉందన్నారు. చూడాలి మరి దీని పై పాక్ ఎలా సమాధానం ఇస్తుంది అనేది.

Related posts