telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత జట్టు పై మంజ్రేకర్‌ ఆగ్రహం…

రెండో వన్డేలో తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 336 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. కానీ ఆ భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ అలవోకగా ఛేదించింది. జానీ బెయిర్‌స్టో, బెన్‌ స్టోక్స్‌ దంచి కొట్టడంతో నాలుగు వికెట్లు కోల్పోయి కేవలం 43.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ నేపథ్యంలోనే సంజయ్ మంజ్రేకర్‌ టీమిండియా బ్యాటింగ్‌పై విమర్శలు గుప్పించాడు. ‘ఒక లక్ష్యాన్ని నిర్దేశించే ముందు అన్ని చూసుకోవాలి. పిచ్‌, మైదాన పరిస్థితులతో పాటు ప్రత్యర్థి బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఈ ఫలితంతో టీమిండియా ఒక పాఠం నేర్చుకుంది. అదే బ్యాటింగ్‌ పిచ్‌పై మోయిన్‌ అలీ 10 ఓవర్లు బౌలింగ్‌ చేసి 47 పరుగులే ఇచ్చాడు. టీమిండియా అతడిపై ఎదురుదాడి చేయలేకపోవడం అని అంటున్నా. మిడిల్ ఓవర్లలో అలీ బౌలింగ్‌లో ఎవరూ ఎదురుదాడికి దిగలేదు. ఇలాంటి బ్యాటింగ్‌ పిచ్‌పై భారత్ చేసిన పెద్ద తప్పుగా దీన్నే భావించొచ్చు’ అని ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ మరో ట్వీట్లో పేర్కొన్నాడు.

Related posts