telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తీరం దాటిన వాయుగుండం…రెండు రాష్ట్రాలకు భారీ వర్షాలు

will be huge rains in 2 telugu states

బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 6:30 నుంచి 7:30 మధ్య కాకినాడ వద్ద వాయుగుండం తీరం దాటింది. ప్రస్తుతం అక్కడ 75 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇది క్రమంగా తెలంగాణ మీదకు పయనిస్తోంది. దీని ప్రభావంతో తెలంగాణలో నేడు అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల కుంభవృష్టి ఉంటాయి. ఉత్తర కోస్తాంధ్రలో చెదురుమదురుగా భారీ జల్లులు పడతాయని..రాయలసీమలో కూడా కొన్ని చోట్ల భారీ జల్లులతో వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు.

ఇటు భారీ వర్షాల దృష్ట్యా తెలంగాణాలో ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. హైదరాబాద్ తో సహా వివిధ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరిక కూడా జారీ చేసింది. ఉరుములు, మెరుపుల తో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది వాతావరణ శాఖ. అటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో… పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో.. కొత్తగూడెం, సత్తుపల్లి, మణుగూరు కోయగూడెం సింగేరేణి బొగ్గు గనులలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలిగింది.

Related posts