telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మ‌న్యం వీరుడు అల్లూరి తెలుగు జాతి యుగ‌పురుషుడు- ప్రధాని మోదీ

*ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి, వీర‌భూమి- ప్రధాని మోదీ
*అల్లూరి సీతారామ‌రాజు కుటుంబ‌స‌భ్యుల‌ను స‌త్క‌రించిన మోదీ..
*వ‌ర్చ‌వ‌ల్‌గా విగ్ర‌హ ఆవిష్క‌రించిన ప్ర‌ధానిమోదీ
*పెద్ద అమిరంలోని స‌భా ప్రాంగ‌ణం నుంచి
*తెలుగులో ప్ర‌సంగాన్ని మొద‌లుపెట్టిన ప్ర‌ధాని మోదీ
*మ‌న్యం వీరుడు అల్లూరి తెలుగు జాతి యుగ‌పురుషుడు..
* ఏపీ త్యాగ‌వీరులు, మ‌హానీయులు పుట్టిన భూమి

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.

భీమవరంలోని ఏఎస్ఆర్ నగర్ లో అల్లూరి సీతారామ రాజు విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అల్లూరి వారసులను ఘనంగా సత్కరించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు సోదరుడి కుమారుడైన 80 ఏళ్ల శ్రీరామరాజు అనే వ్యక్తికి పాదభివందనం కూడా మోదీ చేశారు.

అనంత‌రం మోదీ తెలుగులో ప్రసంగించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి అని, వీర భూమి అని.. ఇలాంటి పుణ్యభూమికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నా, వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’’ అంటూ ప్రసంగాన్ని కొనసాగించారు.

అజాదీకా అమృత్‌ మహోత్సవాలు జరుగుతున్న వేళ.. అల్లూరి 125వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. మన్యం వీరుడు, తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి అని ప్రధాని కొనియాడారు. యావత్‌ దేశానికి అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి అన్నారు.

వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.. రంప ఆందోళన ప్రారంభించి నేటికి వందేళ్లు పూర్తయ్యింది. ఎందరో మహానుభావులు దేశం కోసం త్యాగం చేశారని ప్రధాని మోదీ అన్నారు. అల్లూరి సీతారామరాజు ఆదివాసుల శౌర్యానికి ప్రతీక. అల్లూరి జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం. అల్లూరి తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారు.

మనదే రాజ్యం నినాదంతో ప్రజలను ఏకతాటిపైకి తెచ్చారు. అల్లూరి చిన్న వయస్సులోనే ఆంగ్లేయులపై తిరగబడ్డారన్నారు. ఉయ్యాల వాడ నరసింహారెడ్డి గొప్ప ఉద్యమకారుడన్నారు. దేశాభివృద్ధికి యువత ముందుకు రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

స్వతంత్ర పోరాటంలో ఆదివాసీల త్యాగాలను స్మరిస్తూ ఆదివాసీ సంగ్రహాలయాలు, లంబసింగిలో అల్లూరి మెమోరియల్‌ మ్యూజియం ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ అన్నారు. దేశం కోసం బలిదానం చేసిన వారి కలను సాకారం చేయాలన్నారు.

అల్లూరికి సంబంధించిన అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ప్రధాని అన్నారు. మొగల్లులోని ధ్యాన మందిరం, చింతపల్లి పీఎస్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. వన సంపదపై ఆదివాసులకే హక్కు కల్పిస్తున్నామన్నారు. .

Related posts