telugu navyamedia
ఆంధ్ర వార్తలు

అల్లూరి సీతారామరాజు మహా అగ్ని కణం- ఆయ‌న తెలుగు గడ్డపై పుట్టడం గర్వకారణం

స్వాతంత్ర్యం కోసం, దేశం, అడవి బిడ్డల కోసం చిన్న వయసులోనే ప్రాణాలు అర్పించిన అల్లూరి సీతారామరాజు చిరకాలం నిలిచిపోతారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో భాగంగా పెద అమిరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ… అల్లూరి జయంతి వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. భీమవరం వచ్చిన ప్రధాని మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. 

పరాయి పాలనపై మన దేశం యుద్దం చేస్తూ అడుగులు ముందుకేసిందని సీఎం జగన్ గుర్తుచేశారు. లక్షల మంది త్యాగాల ఫలితమే ఇవాల్టి భారతదేశమని అన్నారు.

పోరాట యోధుల్లో మహా అగ్నికణం అల్లూరి అని అన్నారు. ఆయన తెలుగు గడ్డపై పుట్టడం గర్వకారణమని సీఎం జగన్‌ అన్నారు. లక్షల మంది త్యాగాల ఫలితమే నేటి భారతమని తెలిపారు. ఆయన నడిచిన నేలకు అల్లూరి జిల్లా పేరు పెట్టామని అన్నారు. 125వ జయంతి సందర్భంగా అల్లూరి జిల్లాలో కూడా ఓ కాంస్య విగ్రహ ఆవిష్కరణ జరుగుతోంది అని సీఎం జగన్ అన్నారు.

తెలుగు జాతి, దేశానికి గొప్ప స్ఫూర్తి అల్లూరి అని కొనియాడారు. అల్లూరి సీతారామరాజు విప్లవవీరుడు అని జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

ఒక మనిషిని, ఇంకొక మనిషి.. ఒక జాతిని, మరొక జాతి.. ఒక దేశాన్ని మరొక దేశం దోపిడీ చేయడానికి వీల్లేని సమాజం కోసం మన దేశంలో స్వాతంత్య్ర సమరయోధులు ప్రయత్నించారని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం లక్షలాది మంది ప్రాణాలు అర్పించారన్నారు. 

 

 

 

Related posts