telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

కేసీఆర్ పై జనసేనాని ఘాటు విమర్శలు..పవన్ పై చంద్రబాబు ప్రశంసలు

టీడీపీ అధినేత  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ప్రశంసలు కురిపించారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారెందుకని కేసీఆర్ ను ప్రశ్నించిన పవన్ ను తాను అభినందిస్తున్నానని చంద్రబాబు ఉద్ఘాటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా  ఒంగోలు సభలో చంద్రబాబు మాట్లాడుతూ  తెలంగాణ వెళితే ఆంధ్రావాళ్ల పెత్తనం అంటూ కేసీఆర్ నోరుపారేసుకుంటాడని, ఆంధ్రులకు పౌరుషం లేదా? అని పవన్  కేసీఆర్ ను ప్రశ్నించారని చంద్రబాబు తెలిపారు. కేసీఆర్ నువ్వెవరు మా రాష్ట్రంలో జోక్యం చేసుకోవడానికి? అంటూ పవన్ నిలదీశాడని, దమ్ముంటే ఏపీకి రా నువ్వో నేనో తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరాడని చెప్పారు. వైసీపీ ముసుగులో మాత్రం రావొద్దు అంటూ వార్నింగ్ ఇచ్చాడని చంద్రబాబు పవన్ గురించి గొప్పగా చెప్పారు. పవన్ అంత తెగింపుతో మాట్లాడినందుకు తప్పకుండా అభినందించాలని  చంద్రబాబు పేర్కొన్నారు.

Related posts