కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి రమేష్ జార్కిహొళి రాజీనామా చేశారు. ఆయన ఓ మహిళతో రాసలీలలు సాగిస్తున్న వీడియో నిన్న సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఉన్నది తాను కాదని తన మొహాన్ని మార్ఫ్ చేశారని ముందు మంత్రి పేర్కొన్నారు. అయినా సరే ఇప్పుడు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నామని ఆయన ప్రకటించారు. ఆయన రాజీనామా లేఖను సీఎం బీఎస్ యడియూరప్పకి పంపారు. వెంటనే ఆయన ఆమోదించారు. తన వద్దకు ఒక పనికి పర్మిషన్ ఇప్పించమని వచ్చిన ఓ మహిళను మంత్రి రమేష్ జార్కిహొళి లైంగికంగా వాడుకున్నారని ప్రధాన ఆరోపణ. బెంగళూరులోని ఆర్‌టీ నగరలో నివాసం ఉండే యువతి రాష్ట్రంలోని డ్యామ్‌లను డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించి డాక్యుమెంటరీ తీసేందుకు అనుమతి ఇవ్వాలని మంత్రిని ఆశ్రయించింది. దీని కోసం పర్మిషన్ ఇవ్వాలంటే వేరేది కావాలంటూ ఆయన లైంగికంగా వాడుకున్నాడనేది ఆరోపణ. ఈ వీడియోను బేస్ చేసుకుని బెంగళూరుకు చెందిన సామాజిక కార్యకర్త, పౌర హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు దినేష్ కబ్బన్ పార్క్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే గతంలో హెచ్ డీ కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి జంప్ అయిన ఆయన చాలా మంది ఎమ్మెల్యేలను బీజేపీ వైపునకు తీసుకురావడంలో క్రియాశీలకంగా వ్యవరించారు. అయితే ప్తస్తుతం ఆయన రాజీనామా వార్త వైరల్ గా మారుతుంది.
previous post
next post
సోనియా తెలంగాణ ఇవ్వకుంటే నువ్వు సీఎం అయ్యేవాడివా?