telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

మగవాళ్ళు కనిపిస్తే… కొట్టేస్తా.. : రకుల్

Rakul

బాలీవుడ్ సినిమా ‘మర్జావా’ సినిమా ప్రమోషన్ కోసం చిత్ర యూనిట్ టీవీ షో ‘ది కపిల్ శర్మ షో’లో పాల్గొంది. సిద్దార్థ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్, తారా సుతారియా, రితేష్‌దేశ్‌ముఖ్ ఈ షోలో పాల్గొని ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. ఈ సందర్భంగా రకుల్ తన చిన్ననాటి సంగతులను చెప్పారు. తాను చిన్నప్పుడు మగపిల్లలు కనిపిస్తే చాలు వారిని కొట్టేసేదానినని చెబుతూ, దానికి గల కారణాన్ని కూడా తెలియజేశారు.

షోలో భాగంగా కపిల్ శర్మ.. రకుల్ ప్రీత్‌తో ‘మీరు ఇంత అందంగా ఉన్నారు కదా… ఎప్పుడైనా మగపిల్లలతో గొడవలు వచ్చేవా? అని ప్రశ్నించారు. దీనికి రకుల్ సమాధానమిస్తూ స్కూలు డేస్‌లో ఎవరైనా అబ్బాయిలు… అమ్మాయిలను ఏడిపిస్తూ కనిపిస్తే వారిని కొట్టేసేదానినని అన్నారు. తన తొలి సినిమా ‘యారియా’ విడుదలైన తరువాత 50 కిపైగా ప్రపోజల్స్ వచ్చాయని తెలిపారు.

Related posts