telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరో వివాదంలో చిక్కుకున్న “సడక్-2”

ప్రముఖ బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్‌ దత్‌ ప్రధాన పాత్రలో సడక్ 2 సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఆదిత్యారాయ్‌ కపూర్‌, ఆలియా భట్‌ హీరో, హీరోయిన్లుగా నటిస్తునారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేశ్‌ భట్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా సడక్‌ 2 ట్రైలర్‌ వచ్చేసింది. అయితే ఈ ట్రైలర్ కు ఒక్క గంటలోనే లక్షకు పైగా డిస్ లైకులు వచ్చేసాయి. 1991లో మహేష్‌ భట్‌ దర్శకత్వంలో వచ్చిన హిట్‌ మూవీ సడక్‌కు ఇది సీక్వెల్‌. మకర్‌ దేశ్‌ పాండే, గుల్షన్‌ గ్రోవర్, జిష్ణు సేన్‌ గుప్తా తదితరులు‌ నటిస్తున్నారు. విశేష్‌ ఫిలింస్‌ బ్యానర్‌ పేరు మీద ముఖేశ్‌ భట్‌ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో 21 ఏళ్ల తర్వాత మహేశ్‌ భట్‌ మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. తండ్రి మహేష్‌ భట్‌ దర్శకత్వంలో తొలిసారి ఆలియా నటిస్తున్న సినిమా కూడా ఇదే కావడం విశేషం. కరోనా నేపథ్యంలో ఈ సినిమాను డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో ఈనెల 28న విడుదల కానుంది.
తాజాగా ఈ చిత్రానికి మరో సమస్య వచ్చింది. అలియాభట్‌, ఆదిత్యారాయ్ కపూర్ మధ్య “ఇష్క్ కమాల్” అంటూ సునిల్‌జీత్ కంపోజిషన్ లో వచ్చిన పాట… తన పాటకు కాపీ అని ఫిల్మ్ మేకర్‌, మ్యూజిక్ కంపోజర్ శెజాన్ సలీమ్ ఆరోపిస్తున్నాడు. ”బాలీవుడ్ చిత్రం సడక్ 2 ట్రైలర్ రాకముందే, అందులో’ ఇష్క్ కమల్ ‘అనే పాట ఉంది. పాట విన్న వెంటనే, నేను 11 సంవత్సరాల క్రితం నా స్నేహితుడి కోసం ఇలాంటి కంపోజిషన్ చేశానని భావించాను. ఆ స్నేహితుడి పేరు జైద్ ఖాన్. ఈ పాట ‘రబ్బా హో’, ఇష్క్ కమల్ పాట సంగీతం సరిగ్గా ఆ పాటతో సరిపోలినందున వారు దానిని కాపీ చేశారని నా అభిప్రాయం.’ అంటూ ట్వీట్ చేసాడు . దీనిపై సునిల్ జిత్ స్పందిస్తూ..ఇష్క్ కమాల్ సాంగ్ తాను స్వయంగా కంపోజ్ చేశానని, ఏ పాటకు కాపీ కాదని అన్నాడు. ప్రముఖ సింగర్ జావెద్ అలీతోపాటు చాలా మంది కష్టపడి ఈ పాటను సిద్దం చేశామని, తన మ్యూజిక్ కూడా దీనికి ప్లస్ అయిందని సునీల్ జిత్ అన్నాడు.

Related posts