telugu navyamedia
సినిమా వార్తలు

బ్రహ్మాస్త్ర నుంచి సూప‌ర్ అప్డేట్ : మెగాస్టార్ చిరు వాయిస్ ఓవర్

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం బ్రహ్మాస్త్ర. తెలుగులో ఈ సినిమా బ్రహ్మస్త్రం పేరుతో రిలీజ్ కానుంది. రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌,కీలక పాత్ర పోషిస్తుండగా.. నాగార్జున అక్కినేని, మౌనీ రాయ్‌ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.

Chiranjeevi Lent His Voice To Brahmastra Movie - Sakshi

‘బ్రహ్మాస్త్ర’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్ష‌కులకు మూవీటీమ్​ తాజాగా ఓ సూపర్ అప్డేట్​ ఇచ్చింది. దీంతో పాటే జున్​ 15 ట్రైలర్​ విడుదల చేయనున్నట్లు తెలిపింది.

ఇందులో చిరంజీవి బ్రహ్మాస్త్రం సినిమా ట్రైలర్‌కు వాయిస్‌ అందించాడు. ఆ బ్రహ్మాస్త్రం యొక్క విధి తన అరచేతి రేఖల్లో చిక్కుకుందన్న విషయం ఆ యువకుడికే తెలియదు. అతడే శివ.. అంటూ హీరో గురించి పరిచయం చేశాడు.

Megastar Chiranjeevi Lends His Voice For Brahmāstra's Part-1 Shiva Telugu Trailer

ఈ ప్రతిష్టాత్మమైన సినిమాను సెప్టెంబర్ 9, 2022 న హిందీ, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఎస్.ఎస్.రాజమౌళి ఈ సినిమాని సమర్పిస్తున్నారు.

Related posts