ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ ప్రస్తుతం చేస్తున్న సినిమా చావుకబురు చల్లగా. అయితే ఈ సినిమాలో లావణ్య త్రిపాఠీ హీరోయిన్‌గా చేస్తున్నారు. అయితే ఈ మూవీలో కార్తికేయ ‘బస్తీ బాలరాజు’, లావణ్య త్రిపాఠి ‘మల్లిక’ పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని కౌషిక్ దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పిస్తుండగా బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇందులో బుల్లితెర బ్యూటీ అనసూయ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్‌లు, టీజర్, పాటలు అన్నీ కూడా సినిమాపై అంచనాలను అంతకు అంతా పెంచాయి. ఇప్పుడు ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల అయింది. శవాలని స్మశానానికి పంపించే వాహనానికి డ్రైవర్‌గా కార్తికేయ భిన్నమైన పాత్రలో కనిపిస్తూన్నాడు. అయితే ఇటువంటి వ్యక్తితో లావణ్య ఎలా ప్రేమలో పడింది అనేది సినిమాలోనే చూడాలి. అయితే పూర్తి కామెడీతో ఈ ట్రైలర్ ను నింపేశారు మేకర్స్. అయితే ఈ సినిమా మార్చి19న ప్రేక్షకుల ముందుకు రానుంది. చూడాలి మరి ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుంటుందా… లేదా అనేది.
previous post
next post
వ్యవస్థ మారనంత కాలం రాజకీయ పెత్తనం: ప్రొఫెసర్ నాగేశ్వర్