telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రవిబాబు “ఆవిరి” ట్రైలర్

Aaviri

విభిన్న క‌థా చిత్రాల‌ని తెర‌కెక్కిస్తూ మంచి అభిరుచి కలిగిన దర్శకుడిగా, ఉత్తమ టెక్నీషియన్‌గా రవిబాబు గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవల రవిబాబు పందిపిల్ల ప్ర‌ధాన పాత్ర‌లో “అదుగో” అనే సినిమాని రూపొందించాడు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తాజాగా “ఆవిరి” అంటూ మరో విభిన్న ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రంలో ర‌విబాబు, నేహా చౌహ‌న్, శ్రీముక్త‌, భ‌ర‌ణి శంక‌ర్, ముక్త‌ర్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఫ్లైయింగ్ ప్రాగ్స్ చిత్రాన్ని నిర్మిస్తుంది. స‌క్సెస్ ఫుల్ చిత్రాల నిర్మాత దిల్ రాజు త‌న సొంత బేన‌ర్ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బేన‌ర్ మీదుగా చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమాలో ఆవిరికి, ఇంట్లో ఉన్న ఆత్మకు ఉన్న సంబంధం ఏమిటో తెలియాలంటే నవంబర్ 1 వరకు ఆగాల్సిందే. ‘ఆవిరి’ సినిమాను రవిబాబు డైరెక్ట్ చేయడమే కాకుండా తాను కూడా ఇందులో ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. ఇతర పాత్రల్లో నేహా చౌహాన్, శ్రీముక్త, భరణి శంకర్, ముఖ్తార్ ఖాన్ నటించారు. ఇటీవల చిత్ర ఫ‌స్ట్ లుక్, టీజర్ విడుద‌ల చేయగా… వాటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రబృందం. ఈ ట్రైలర్‌లో రాజ్ కుమార్ రావ్ అండ్ ఫ్యామిలీ ఒక ఇంట్లో ఉంటారు. వాళ్ల పాప ఓ సమస్యతో బాధ పడుతుంటుంది. అలాంటి ఇంట్లోనే వీళ్లతో పాటు ఆ ఇంట్లో ఒక ఆత్మ ఉంటుంది. అప్పుడే పాప ఇంట్లోంచి పారిపోతుంది. ఆత్మ ఆ పాపను బయటికి తీసుకెళ్లిపోతుంది. అప్పుడు ఆ తల్లిదండ్రులు ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేసారనేది ఈ సినిమా ట్రైలర్‌లో చూపెట్టారు. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

Related posts