సైరా నరసింహారెడ్డి సినిమా విజయం సాధించిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుసగా పలువురు రాజకీయ ప్రముఖులను కలుస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడి చరితను తెరకెక్కించిన విధానాన్ని వివరిస్తున్నారు. ఇటీవల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను కూడా కలిశారు. ఆమె కూడా సినిమాను చూసి మెగాస్టార్‌ను మెచ్చుకున్నారు. ఈ క్రమంలో చిరంజీవి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కూడా కలవడానికి అపాయింట్‌మెంట్ కోరినట్టు తెలిసింది. అయితే ఇంకా అపాయింట్‌మెంట్ ఖరారు కాలేదు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని మెగస్టార్ చిరంజీవి కలవబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈనెల 11న ఉదయం 11 గంటలకు అమరావతిలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని చిరంజీవి కలుస్తారంటూ వార్తలు వచ్చాయి. జగన్‌ను కలిసేందుకు చిరంజీవికి సీఎంఓ అపాయింట్‌మెంట్ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. అయితే, సీఎంఓ నుంచి ఎలాంటి అపాయింట్‌మెంట్ ఖరారు కాలేదని తెలిసింది. చిరంజీవికి అపాయింట్‌మెంట్‌పై సీఎంఓలోని ఒకరు ఈ విషయాన్ని తెలియజేశారు. చిరంజీవికి అమరావతిలో సీఎంఓ అపాయింట్‌మెంట్ ఇచ్చినట్టు వచ్చిన వార్తలు అవాస్తవం. అపాయింట్‌మెంట్ ఇంకా ఖరారు కాలేదు అని సీఎంఓలో ఓ అధికారి తెలిపారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈనెల 14న చిరంజీవికి అపాయింట్‌మెంట్ ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి.
previous post
next post
నోరుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు..