telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణకు మూడు రోజుల పాటు భారీ వర్షాలు

rain hyderabad

తెలంగాణలో వాతావరణం మారింది. రాష్ట్రానికి వర్ష సూచన ఉందని చెప్పింది వాతావరణ శాఖ. ఉపరితల ద్రోణి కారణంగా రాగల మూడు రోజులు రాష్ట్రఃలో అక్కడక్కడ ఓ మోస్తారు నుంచి తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. శుక్రవారం విదర్భ పరిసర ప్రాంతాలకు ఉపరితల ఆవర్తనం విస్తరించడంతో ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్లా జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురువొచ్చని వాతావరణ శాఖ చెప్పింది. 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా తెలిపింది. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్‌ జిల్లా బేలలో ఒక మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. శుక్రవారం అత్యధికంగా మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లూరులో 38.4 డిగ్రీల గరిష్ణ ఉష్ణోగ్రత నమోదైంది.

Related posts