telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

అమ్మాయిలకు మాత్రమే… రూమ్ లో సీక్రెట్ కెమెరా…?

Florida

బోయింటన్ బీచ్ నగరంలో ఉంటున్న జెఫ్రీ ఖోమా (67) అనే వ్యక్తి తన ఇంట్లోని ఓ పోర్షన్‌ను కేవలం మహిళలకే అద్దెకు ఇస్తూ వచ్చాడు. గతేడాది నవంబరులో జెఫ్రీ ఇంట్లో అద్దెకు ఉంటున్న ఓ యువతి తన గదిలో సీక్రెట్ కెమెరాను గుర్తించింది. వెంటనే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో.. పోలీసులు జెఫ్రీ ఇంటికి వచ్చి సోదాలు నిర్వహించారు. అధికారులకు ఓ పెన్ డ్రైవ్‌ దొరకగా.. అందులో దాదాపు పదిహేనేళ్ల నుంచి వివిధ తేదీలతో అనేక అశ్లీల ఫొటోలు, వీడియోలు లభించాయి. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి ఆ పెన్ డ్రైవ్‌ను పరిశీలించగా.. అందులో రికార్డ్ అయిన ప్రదేశం తాను ఉంటున్న ఇల్లేనని గుర్తించింది. అయితే ఆ యువతికి చెందిన ఫొటోలు, వీడియోలు పెన్ డ్రైవ్‌లో దొరకకపోవడం గమనార్హం. జెఫ్రీ కేవలం అమ్మాయిలకు మాత్రమే ఇంటిని అద్దెకు ఇస్తూ వచ్చాడని పోలీసులు తెలిపారు. చాలా మంది యువతులు ఎందుకలా అని సందేహంతో ప్రశ్నించినప్పటికీ.. ఆడవాళ్లు ఇంటిని శుభ్రంగా ఉంచుతారని.. అందుకని వాళ్లకు మాత్రమే ఇస్తున్నానని చెప్పినట్టు యువతి వివరించింది. కాగా, పెన్ డ్రైవ్‌లో దొరికిన వీడియోల ద్వారా జెఫ్రీపై ఏడు కేసులను నమోదు చేశారు. తాను తప్పు చేసినట్టు జెఫ్రీ నేరాన్ని అంగీకరించడంతో కోర్టు అతడికి ఏడాది జైలు శిక్ష విధించింది.

Related posts