telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దీన్ని నా ‘కామ్‌ టైమ్‌’గా మార్చుకున్నా : నిత్యామీనన్

Nitya

టాలెంటెడ్ హీరోయిన్‌గా ప్రత్యేకతను చాటుకున్న హీరోయిన్లలలో ఒకరుగా నిత్యామీనన్ పేరు సంపాదించుకుంది. అలాగే గ్లామర్ విషయంలో తనకంటూ కొన్ని పరిధులు విధించుకుని, వాటికి కట్టుబడే సినిమాలు చేస్తుంది. నిత్యామీనన్‌కు నచ్చితేనే ఏ సినిమా అయినా చేస్తుంది. లేదంటే ఎంత పెద్ద ఆఫర్ అయినా సరే.. ఆమెను ఒప్పించడం చాలా కష్టం. ఇక కరోనా ఉధృతితో సినిమా షూటింగ్ లకు ప్రభుత్వం అనుమతిచ్చినప్పటికీ కొంత మంది నటీనటులు షూటింగ్ లలో ఇంకా పాల్గొనట్లేదు. ఆ లిస్ట్ లో నిత్యామీనన్ కూడా ఉన్నారు. ఇటీవల ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల అందరం ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ ఖాళీ సమయాన్ని ఉపయోగకరంగా వినియోగించుకుంటున్నానని. అలాగే దీన్ని నా ‘కామ్‌ టైమ్‌’గా కూడా మార్చుకున్నానని ఆమె వెల్లడించారు. ఆమె తన తరవాత సినిమాల గురించి మాట్లాడుతూ.. డిజిటల్ నుండి చాలా స్క్రిప్ట్స్ వస్తున్నాయని అన్నారు. మంచి స్టోరీస్ వస్తే తప్పకుండా నటిస్తానని చెప్పారు. ప్రస్తుతం జయలలిత బయోపిక్, ధనుష్ తో ఓ సినిమాలో నటిస్తున్నాని తెలిపారు. తెలుగులో మరో రెండు సినిమాల్లో నటిస్తున్నట్టు ప్రకటించారు.

Related posts