telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారు

Batti vikramarka

తెలంగాణ ప్రభుత్వపై మరోసారి భట్టి విక్రమార్క విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రం లో నీటిపారుదల, వ్యవసాయ రంగాలు ఆందోళనకరంగా ఉన్నాయని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రంలో పంటనష్టం జరిగిందని.. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం పంటనష్టం పై సర్వే చేయలేదన్నారని మండిపడ్డారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారని..నిర్బంధ సాగు పేరుతొ రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలతో పంట నష్ట పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా జిల్లాలో వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లిందని…కనీసం ఇప్పుడు మొక్కజొన్న సాగుకు రైతులు సిద్ధం అవుతుంటే అధికారులు వద్దని గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మొక్కజొన్నకు మద్దతు ధర ఇవ్వబోమని ప్రభుత్వం చెబుతోందని..ప్రభుత్వ విధానాలతో వ్యవసాయ రంగం అధోగతి పాలు అవుతుందన్నారు. ప్రభుత్వం రైతులకు మద్దతు ధరలో వైఫల్యం చెందిందని.. కేసీఆర్ రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారని ఫైర్‌ అయ్యారు. మద్దతు ధర ఎవరి సొత్తుకాదని.. మద్దతు ధర కల్పించేదాక పోరాటం చేస్తామని హెచ్చరించారు. 11న రైతు సమస్యల పై ఖమ్మంలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామన్నారు.

Related posts