telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జగన్ మాట్లాడుతున్నా కేసీఆర్ నోరుమెదపట్లేదు: ఉత్తమ్

uttam congress mp

కృష్ణా నదీ జలాల విషయమై ఏపీ సీఎం జగన్ మాట్లాడుతున్నా తెలంగాణ సీఎం కేసీఆర్ నోరుమెదపట్లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపును నిరసిస్తూ హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఇవాళ ఆయన నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ కేసీఆర్ తో మాట్లాడే ‘పోతిరెడ్డిపాడు’ పనులు మొదలు పెడుతున్నామని వైసీపీలో కీలక నేత శ్రీకాంత్ రెడ్డి అన్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.

‘పోతిరెడ్డిపాడు’ సామర్థ్యం పెంచితే మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు ఎడారిగా మారిపోతాయంటూ ధ్వజమెత్తారు.ఏపీ ఎన్నికల్లో జగన్ కు కేసీఆర్ ఫండింగ్ చేసినప్పటి నుంచి వీళ్లిద్దరూ ‘అలయ్ బలయ్’ అయి తిరుగుతున్నారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు విస్తరణ పనులు మొదలైతే మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు ఎడారిగా మారుతాయన్నారు. తెలంగాణ రైతులు వ్యవసాయానికి ఇది గొడ్డలిపెట్టు లాంటిదని పేర్కొన్నారు.

Related posts